తల్లిపై దాడి చేసిన తమ్ముడు.. కోపంతో చాకుతో పొడిచిన అన్న

by srinivas |
తల్లిపై దాడి చేసిన తమ్ముడు.. కోపంతో చాకుతో పొడిచిన అన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడు కన్న తల్లిపై చేయిచేసుకున్నాడు. తమ్ముడు చేయి చేసుకోవడాన్ని గమనించిన అన్న అమ్మమీదే చేయి చేసుకుంటావా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో చాకు తీసుకుని తమ్ముడి చాతిలో పొడిచాడు. దీంతో తమ్ముడు చనిపోయాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

కాగా మైలవరం నియోజకవర్గం స్థానిక పొందుగల రోడ్డులో కృష్ణవరపు ప్రసన్నకుమార్, కరుణ కుమార్‌లు నివశిస్తున్నారు. అయితే తల్లి‌పై కరుణ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అన్న ప్రసన్నకుమార్ తమ్ముడిపై కోపంతో రగిలిపోయాడు. పక్కనే ఉన్న చాకుతో తమ్ముడిని పొడవడంతో కరుణ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా కరుణకుమార్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story