టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

by srinivas |
టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. రూ.25వేల పూచీకత్తుతో ఆయనకు విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి గురువారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని, విచారణకు సహకరించాలని సూచించింది. ఆయన పట్టాభి కోర్టు నుంచి విడుదల కానున్నారు.

కాగా సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా సీరియస్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయానికి చేరుకునేందుకు ప్రయత్నం చేశారు. అటు పట్టాభి కూడా భారీ కాన్వాయ్‌తో గన్నవరం టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అనుచితంగా వ్యవహరించారని పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గన్నవరం ఘటనకు పట్టాభి వ్యాఖ్యలే కారణమని డీజీపీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed