ప్రకాశం బ్యారేజీలో రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి కాకినాడ అబ్బులు

by srinivas |
ప్రకాశం బ్యారేజీలో రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి కాకినాడ అబ్బులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీలో (Prakasam Barrage) రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల (Rains and Foods) కారణంగా బ్యారేజీలోకి 4 బోట్లు (Boats) కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే బ్యారేజీలో బోట్లు ఢీకొట్టడంతో గేట్లు ధ్వంసం అయ్యాయి. దీంతో బోట్ల ఢీ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యారేజీ గేట్లు పూర్తి ధ్వంసం అయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రభుత్వంతో పాటు ఇరిగేషన్ అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ (Rescue operation) క్లిష్టతరంగా మారింది. బోట్లు హెవీ వెయిట్‌ ఉండటంతో పాటు నదిలో 10 అడుగుల మేర లోపలికి వెళ్లి కట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పైగా బోట్లను కట్ చేసేందుకు అధిక భారం అవడమే కాకుండా ప్రక్రియ కష్టతరంగా మారింది. మూడు రోజులు పాటు తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాత బోట్లను లంగర్‌తో బయటకు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడకు చెందిన అబ్బులు టీమ్‌ను రంగంలోకి దింపారు. 14 మందితో కూడిన ఈ బృందం.. బోట్లను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. 50 టన్నులకు పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్య్కూ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ తొలగింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story