- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Politics: ఆసక్తి రేపుతున్న గన్నవరం రాజకీయాలు... చంద్రబాబుతో దాసరి భేటీ
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కలిశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో యార్లగడ్డకు అన్ని తానై దాసరి వ్యవహరించారు. యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం వైసీపీలో పని చేస్తున్నారు. త్వరలో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును దాసరి కలవడంతో చర్చనీయాంశంగా మారింది.
కాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వంశీ రాకను యార్లగడ్డ వర్గీయులు తొలి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ నియోజకవర్గంకు సంబంధించి అన్ని బాధ్యతలను వంశీకే సీఎం జగన్ అప్పగించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ఈసారి సీటు వంశీకే వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని భావించిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.