- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kodali Nani: రాజకీయాలు వదిలేస్తా
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా వచ్చినా గుంపులుగా వచ్చినా చేసేది ఏమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితమే పునరావృతమవుతుందని ఆయన తెలిపారు. గుడివాడలో సోమవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ దేశంలో ఎవ్వరిని కలుపుకున్న, ఎవరితో వచ్చిన వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. విడివిడిగా వచ్చినప్పుడు 2019లో వచ్చిన ఫలితమే తిరిగి పునరావృతం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం ఆకాశంలో ఉమ్మి వేసినట్లేనని విమర్శించారు. మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ పాదయాత్ర చేసి..మరొకరిని గెలిపించగలరా? అని ప్రశ్నించారు. తాను అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేసిన వాఖ్యలపై మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి