- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ సిటిజన్స్‌కు అదిరిపోయే బెనిఫిట్స్ ప్రకటించిన భారతీయ రైల్వేస్..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వే(Indian Railways) సీనియర్ సిటిజన్స్(Senior citizens) కోస్ కొత్త సౌకర్యాలను ప్రకటించింది. వృద్ధ ప్రయాణికుల(Elderly travelers)ను దృష్టిలో ఉంచుకుని.. వారి భద్రత(Safety)కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు సౌకర్యవంగంగా, సురక్షితంగా చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాలను ప్రకటించారు. ఈ సౌకర్యాలు 45 ఏళ్లు దాటిన మహిళలకు అండ్ 58 సంవత్సరాలు పైబడిన పురుషులకు వర్తిస్తాయి. వీరికి లోయర్ బర్త్(Lower Birth) సదుపాయం కల్పించనున్నారు. టికెట్ బుక్(Ticket book) చేస్తున్నప్పుడు ప్రయాణికులు వారి ఏజ్ ధృవీకరణ పత్రాన్ని(Age Certificate) అందించాలి.
దీంతో లోయర్ బర్త్ సదుపాయం లభిస్తుంది. దీనివల్ల వృద్ధులు పడిపోయే ప్రమాదం తగ్గుతుందని వెల్లడించారు. ఎక్కడం, దిగడం కూడా సులభమవుతుందని తెలిపారు. పై బర్త్‌కు ఎక్కుతుండగా.. చాలా మంది వృద్ధులు అనారోగ్య సమస్యల(Health problems)కు గురవుతున్నారని.. ఈ సదుపాయం కల్పించడం వల్ల ఉపశమం పొందవచ్చని రైల్వే అధికారులు(Railway officials) పేర్కొన్నారు. లోయర్ బెర్త్ నుంచి సామాను కూడా తీసుకెళ్లడం వృద్ధులకు ఈజీగా ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా వీల్ చైర్ సౌకర్యం(Wheelchair facility) కూడా కల్పించారు. ఇందుకోసం రైల్వే సిబ్బంది వృద్ధులకు హెల్ప్ చేయనున్నారు. ఈ సదుపాయం అరైవల్ స్టేషన్(Arrival Station)లో కూడా అందుబాటులో ఉంది. అలాగే వృద్ధ ప్రయాణికులకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రైలు గార్డు(train guard) లేదా టీటీఈ(TTE)ను అప్రోచ్ అవ్వొచ్చు. వారు సేవను అందిస్తారు. ప్రయాణ సమయంలో వృద్ధ ప్రయాణికులను సురక్షితంగా ఉంచడం ఈ సౌకర్యం ఉద్దేశ్యం.