Pic Of The Day: ఒక్క స్కూటీపై ఏకంగా ఎనిమిది మంది ప్రయాణం

by Gantepaka Srikanth |
Pic Of The Day: ఒక్క స్కూటీపై ఏకంగా ఎనిమిది మంది ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు. మహా పురుషులు అవుతారు అని ఓ మహాకవి చెప్పారు. రుషులు కావడమేమో కానీ.. ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం మాత్రం తప్పకుండా ప్రమాదాన్ని కొని తెస్తుందనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమందిలో మాత్రం అస్సలు మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా మంగళగిరిలో కనిపించిన ఈ దృశ్యం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. ఓ స్కూటీ(Scooty) మీద ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రయాణం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.


కాజా టోల్‌‌ప్లాజా(Kaja Toll Plaza) నుంచి మంగళగిరి(Mangalagiri) వైపు వెళ్తున్న ఈ స్కూటీని గమనించిన కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్త వైరల్ అయింది. దీంతో నెటిజన్లంతా ‘ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి’ అని ప్రభాస్ మిర్చీ సినిమాలోని డైలాగ్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా కేరళలో కారు నడిపిన వ్యక్తికి రెండున్నర లక్షలు ఫైన్ విధించారు.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.. మరి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఏడుగురిని బైకుపై తీసుకెళ్తున్న ఇతనికి ఎంత ఫైన్ విధించాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




Advertisement

Next Story