SBI Branches: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన.. ఎస్‌బీఐ నుంచి మరో 500 బ్రాంచీలు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-18 14:56:30.0  )
SBI Branches: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన.. ఎస్‌బీఐ నుంచి మరో 500 బ్రాంచీలు..!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవలను మరింత విస్తరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా మరో 500 కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణతో ఎస్‌బీఐ బ్రాంచీల సంఖ్య 23,000కు చేరుకోనుందని తెలిపారు. ముంబై(Mumbai)లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం(100th Anniversary) సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. '1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో పార్లమెంట్(Parliament)లో చట్టం ద్వారా దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రారంభ దశలో 250 బ్రాంచీలతో ఉన్న ఎస్‌బీఐ, వచ్చే ఏడాది మార్చి నాటికి 23,000 బ్రాంచీలకు చేరుకోనుంది'' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 6580 ఏటీఎం(ATM)లు ఉన్నాయని, బ్యాంక్ డిపాజిట్ల వాటా 22.4 శాతంగా ఉందని వెల్లడించారు. అలాగే 50 కోట్లకుపైగా కస్టమర్లు ఎస్‌బీఐకు ఉన్నారని, రోజుకు దాదాపు 20 కోట్ల యూపీఐ లావాదేవీల(UPI Transactions)ను సంస్థ నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.

Advertisement

Next Story