Breaking: వైసీపీ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ.. పార్టీకి షాక్ ఇచ్చిన కేశినేని నాని

by srinivas |   ( Updated:2023-05-21 10:45:45.0  )
Breaking: వైసీపీ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ..  పార్టీకి   షాక్ ఇచ్చిన కేశినేని నాని
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. అధికార, పత్రిపక్ష పార్టీలు ఎప్పుడూ మాటలు తూటలు పేల్చుకుంటుంటూనే ఉంటాయి. అయితే అభివృద్ధి విషయంలో ఈ రెండు పార్టీల నేతలు కలిసి పని చేస్తున్నారు. అంతేకాదు అలా ఉండటమే రాష్ట్రానికి, దేశానికి మంచిదని హితవు పలికారు.


విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ గరం గరంగా ఉంటాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతేకాదు కార్యక్రమాల్లో కూడా కలిసుకోరు.. అయితే తాజాగా జరిగిన కార్యక్రమం పార్టీలు వేరైనా నాయకులంతా ఒక్కటే అనేలా చేసింది. అంతేకాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై విపక్ష పార్టీ ఎంపీ ప్రశంసలు కురిపించడం కూడా చేయించింది.

కృష్ణా జిల్లా నందిగామలో పలు అభివృద్ధి పనులకు వైసీపీ శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని టీడీపీ ఎంపీ కేశినేని నానిని సైతం ఆహ్వానించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి కేశినేని నాని నందిగామలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించారు. అభివృద్ధి కోసం పోరాటం చేయడంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ముందుంటారని వ్యాఖ్యానించారు. రాజకీయం అనేది ఎన్నికల వరకే పరిమితవ్వాలని కేశినేని సూచించారు. అలాగే వైసీపీ-టీడీపీ సిద్ధాంతాలు వేరైనా కలిసి పని చేస్తామని చెప్పారు. అధికార, విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే దేశం అభివృద్ది చెందుతుందని జోస్యం చెప్పారు.

కాగా మరో ఏడాదిన్నలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నందిగామలో బలపడేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ ఎంపీ పొగడటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు గత కొంతకాలంగా టీడీపీలో కేశినేని బ్రదర్స్ ఇష్యూ నడుస్తోంది. కేశినేని సొదరుడు చిన్ని టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవడంతో నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనడంతో టీడీపీకి షాక్ ఇచ్చినట్లైందని పలువురు నేతలు అంటున్నారు.

Advertisement

Next Story