ఏపీకి అస్థిత్వం లేదు: AB Venkateswararao

by srinivas |   ( Updated:2022-12-24 14:41:06.0  )
ఏపీకి అస్థిత్వం లేదు: AB Venkateswararao
X


దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగును ముందుకు తీసుకెళ్లకపోతే ఆంధ్రప్రదేశ్‌కి అస్థిత్వం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడ సిద్దార్ధ అకాడమీలో జరిగిన 5వ ప్రపంచ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మారుతున్న సామాజిక పరిస్థితులలో రచయితల పాత్ర'అనే అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ చిరునామా కేవలం తెలుగు మాత్రమేనని చెప్పా. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలుగువారి పాత్రను ఈతరం, ఇంతకుముందుతరం వారు మర్చిపోయారనిపిస్తోందన్నారు. మద్రాస్ నుంచి ఎన్నో పోరాటాలు, త్యాగాలు నుండి పుట్టిన రాష్ట్రాన్ని వారసత్వంగా పొందామో, ఆ భాషను పెంపొందించడానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి భాషను పరిచయం చేయడానికి ఈసం మాత్రం ప్రయత్నం చేయకపోవడం తెలుగు వారు చేసుకున్న దురదృష్టమన్నారు. తెలుగువారు ఒక భాషగా, ఒక జాతిగా, ఒక సంస్కృతిగా తమను తాము గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, మధ్యాంద్ర అంటూ పలురకాలుగా తెలుగును విభజిస్తున్నామని ఏబీవీ విమర్శించారు. చివరకు మనం ఎక్కడివారం అంటూ చూసుకునే దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నేడు ఎన్నో భాషా సమూహాలు అంతరించి పోయాయని..అందుకు తెలుగు అతీతం కాదని తెలిపారు. 40 ఏళ్లుగా తెలుగులో సాహిత్య ప్రమాణాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా సంస్థలు కూడా ఒక్కొక్కటి మూసేస్తున్నారని, కనీసం దినపత్రికలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు విషయంలో ఒక జెన్యూన్ డిబేట్ నడుస్తుందన్నారు. చిన్న వయసులోనే పిల్లలకు జ్ఞానం వికసించాలన్నా, మేధస్సు వికసించాలన్నా పిల్లలకు మాతృభాషలోనే బోధన జరగాలని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed