గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొడాలి నాని.. ఎవరూ ఊహించి ఉండరు

by Mahesh |   ( Updated:2024-10-15 08:37:04.0  )
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొడాలి నాని.. ఎవరూ ఊహించి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నాని దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో గత కొంతకాలంగా మీడియాకు రాజకీయ వ్యాఖ్యలను ఆయన దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి కొడాలి నాని తిరుమలలో దర్శనమిచ్చారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఆయన ఒక్కసారిగా గుండు గీయించుకొని, గడ్డం మీసం లేకపోవడంతో ఎవరూ ఆయనను గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి తిరుమలకు వచ్చిన కొడాలి నాని.. మంగళవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్న ఆయన పూర్తిగా గెటప్ మార్చేశారు. తెల్లని బట్టలు ధరించి.. గుండు గీయించుకొని ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు గడ్డం మీసాలతో కనిపించే ఆయన ఒక్కసారిగా అలా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. తన అభిమానులు తీవ్ర నిరాశకు గరవ్వగా.. సాధారణ నెటిజన్లు మాత్రం తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed