Breaking: డైరెక్టర్ హరీష్ డైలాగ్ ని కాపీ కొట్టిన కొడాలి నాని..

by Indraja |
Breaking: డైరెక్టర్ హరీష్ డైలాగ్ ని కాపీ కొట్టిన కొడాలి నాని..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా పేర్లు, డైలాగ్ లు ట్రెండ్ గా మారిపోయాయి. మైక్ ముందుంటే చాలు నేతలు,అధినేతలు పంచ్ డైలాగ్ లను పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని తాను పామాట్లాడేది రాష్ట్రవ్యాప్తంగా చూస్తారు అనే విషయాన్ని మర్చిపోయారేమోగాని.. తాను ఓ మాజీ మంత్రి అనే గర్వం లేకుండా సాధారణ వ్యక్తిలానే టీడీపీ నేతలను దుర్భాషలాడారు.

వైసీపీ చేపట్టిన మార్పులు చేర్పుల నేపథ్యంలో కొందరు సిట్టింగ్ లను అధిష్టానం పక్కన పెడుతోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానికి కూడా టికెట్ నిరాకరించింది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం పైన స్పందించిన కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ హరీష్ రీపోటర్ సురేష్ ఉద్దేశిస్తూ వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అని ఓ డైలాగ్ ను చెప్పారు. ఆ డైలాగ్ ని కొడాలి నాని తన వర్సిన్ లోకి మార్చుకున్నారు.

వినేవాడు తెలుగు తమ్ముడైతే చెప్పేవాడు చంద్రబాబు అన్నారు. 150 నియోజవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదని పేర్కొన్నారు. ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చెయ్యాలి అనేది జగన్ చెపుతారని.. ఈ పకోడీగాళ్లకు ఏంటి సంబంధం అని ప్రశించారు. తనని ఓడించాలి అంటే చంద్రబాబును గుడివాడనుండి పోటీ చేయమని చెప్పండి అని వ్యాఖ్యానించారు. ఇక ఫ్లెక్సీలు ఏముంది ఎవరైనా కట్టిస్తారు.. ఆ ఫ్లెక్సీలు కట్టించింది ఎవరో దురదగుంటాకు గాళ్ళని.. ఇవన్నీ తనని ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబు ఆడుతున్న నాటకాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story