AP News : ఏపీ డిప్యూటీ స్పీకర్ నియామకంపై కీలక చర్చలు

by M.Rajitha |
AP News : ఏపీ డిప్యూటీ స్పీకర్ నియామకంపై కీలక చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Nayudu) అధ్యక్షతన ఎన్డీఏ లేజిస్లేటివ్(NDA Legislative) సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి టీడీపీ(TDP), జనసేన(JANASENA), బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్(Deputy speaker) నియామకంపై ఈ సమావేశంలో తీవ్ర చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అలాగే అసెంబ్లీ, మండలి సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకంపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో 9 మంది విప్ లను నియమిస్తారని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కనుందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం అనుసరించే వ్యూహం గురించి కూడా చర్చలు జరిగినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed