ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by M.Rajitha |   ( Updated:2024-10-21 14:12:45.0  )
ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో సామన్య ప్రజలకు ఇస్తున్న ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ మార్గాల్లో అధికంగా ఇసుక తరలింపు జరుగుతుందని.. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఇసుక అక్రమ రవాణాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇసుక రీచ్ లలో తవ్వకాలు, లోడింగుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విషయంపై మరోసారి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయితీల్లో సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపుకు అనుమతులు ఇచ్చామని.. ఇసుక తీసుకువెళ్ళేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed