- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది చిన్న విషయం కాదు.. తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూ((Tirumala laddu))లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని అన్నారు. వైసీపీ హయాంలో ఎంపిక చేసిన కంట్రాక్టర్లే ఇప్పటికీ నెయ్యి సప్లై చేస్తున్నారని చెప్పారు. ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు(Chandrababu) ఎలా ఈజీగా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు.
రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయటపెట్టారా? అని మండిపడ్డారు. అప్పుడే విచారణకు ఆదేశించి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ (Tirumala laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన వార్త ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ నేతలు, హిందువులు, స్వామి వారి భక్తులందరూ నాటి జగన్(Jagan) ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.