AP News:మద్య నిషేధం సీఎం జగన్ కల..సజ్జల కీలక వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-01 11:54:24.0  )
AP News:మద్య నిషేధం సీఎం జగన్ కల..సజ్జల కీలక వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారంలో ప్రత్యర్థుల పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారంలో భాగంగా సభలు, సమావేశలలో పార్టీ నేతలు బిజీబిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..మద్య నిషేధం చేయడం సీఎం జగన్ కల అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మద్య నిషేధం హామీలు అమలు చేయలేకపోయాం అని చెప్పారు. అందుకే 99 శాతం అమలు చేశామని చెబుతున్నాం అన్నారు. ఈ హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించలేదు అని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో పై ప్రజలకు నమ్మకం కుదిరింది అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story