- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral Video:కార్తీక పౌర్ణమి రోజు అద్భుత దృశ్యం.. జంట పొడపాముల సయ్యాట
దిశ, ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రెండు పొడ పాములు సయ్యాటలాడాయి. ఈ సయ్యాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. శివాలయానికి సమీపంలోనే శేషాచల కొండ దిగువ భాగాన పాములు సయ్యాటలాడటం చూసిన స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుమారు గంట సేపు పైగా రెండు పొడ పాములు ఒకదానితో ఒకటి బుసలు కొట్టుకుంటూ సయ్యాటలాడాయి. సాధారణంగా త్రాచు పాము జెర్రిపోతు మాత్రమే సయ్యాటలాడతాయంటారు. కానీ ఇక్కడ పొడపాములు సయ్యాటలాడడం వింత ఘటనగా చెప్పుకుంటున్నారు. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో పాముల సయ్యాటను స్వామి వారి మహత్య్మంగా స్థానికులు భావిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024
ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం
శివాలయానికి సమీపంలోనే జరగడంతో దేవుడి మహత్యంగా భావిస్తున్న భక్తులు#KarthikaPournami #KarthikaMasam #DwarakaTirumala #Bigtv pic.twitter.com/CzibldQb0s