Kakinada Port: కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌పై నిఘా కట్టుదిట్టం.. సర్కార్ సంచలన నిర్ణయం

by Shiva |
Kakinada Port: కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌పై నిఘా కట్టుదిట్టం.. సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ పోర్టు (Kakinada) నుంచి పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ రవాణా (Rice smuggling) వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో కొందరు పోర్టును స్మగ్లింగ్‌ (Smuggling)కు అడ్డాగా చేసుకున్నారు. దాదాపు 1.60 కోట్ల లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఆ బియ్యం విలువ సమారు. రూ.45 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాకనాడ యాంకరేజ్ పోర్టు (Anchorage Port)పై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.

.అదేవిధంగా స్టెల్లా నౌక (Stella Ship)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. త్వరలోనే పోర్టు భద్రతకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ (CSO)ను నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోర్ట్ సిబ్బంది ట్రాన్స్‌పోర్టు (Transport)పైనే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. పోర్టుకు వచ్చిన ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే. ఇంకా గోడౌన్‌ (Godown)లలో బియ్యం రీసైక్లింగ్ స్టార్టెక్స్ మిషన్లు (Startex Machines) ఉండటంతో పౌర సరఫరాల శాఖ సీరియస్ అయింది. వాటిని వెంటనే సీజ్ చేసి అక్కడి నుంచి మరోచోటికి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story