AP Politics: రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి.. కాకర్ల కీలక వ్యాఖ్యలు..

by Indraja |
AP Politics: రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి.. కాకర్ల కీలక వ్యాఖ్యలు..
X

దిశ, ఉదయగిరి: ఈ రోజు (శుక్రవారం) టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వింజమూరులో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్, సభ ఏర్పాట్లను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, కంభం విజయరామరెడ్డి తో కలిసి సురేష్ పరిశీలించారు.

పంచాయతీ బస్టాండు సభకు అనువైన ప్రదేశంగా గుర్తించి రోడ్ షో, కాన్వాయ్ పై నుంచే చంద్రబాబు ప్రసంగించే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. అలానే ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి జనసేన బిజెపి కలిశాయని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో తమను గెలిపిస్తే విద్య వైద్యం ఉపాధి కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. టిడిపిని గెలిపించి రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, కాకర్ల వెంకట్, చల్ల వెంకటేశ్వర్లు, గడప సుదర్శన్ రెడ్డి, చల్ల శ్రీనివాసులు, నర్సారెడ్డి, దంతులూరి వెంకటేశ్వర్లు, షేక్ మహబూబ్ బాషా, పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story