Bhakthi: శ్రీవారి ఆలయంలో కన్నుల విందుగా జరిగిన కాకబలి కార్యక్రమం..

by Indraja |
Bhakthi: శ్రీవారి ఆలయంలో కన్నుల విందుగా జరిగిన కాకబలి కార్యక్రమం..
X

దిశ వెబ్ డెస్క్: కలియుగ దైవంగా తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి కోట్లల్లో భక్తులు ఉంటారు.ఎక్కడెక్కడి నుండో తరలి వచ్చే భక్తులతో తిరుమల దేవస్థానం నిత్యం కోలాహలంగా ఉంటుంది. అయితే స్వామి వారికి చేసే పూజల్లో కాకబలి కార్యక్రమం కూడా ఒకటి. ఈ కాకబలి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజునిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఈ రోజు కూడా కాకబలి కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది. ఈ రోజు కనుమ పండుగను కన్నుల విందుగా నిర్వహించారు. అనంతరం వైదికోక్తంగా కాకబలి” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆలయ అర్చక స్వాములు అన్నం లో పసుపు కుంకుమ వేరు వేరుగా కలిపి.. ఆ అన్నాన్ని స్వామి వారి ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి వారికి నివేదించారు.

కాగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల వెంకటరమణున్ని హిందువులే కాదు కడప లోని ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఇంటి అల్లుడిగా భావించి పూజిస్తారు. అంటే ఆ దేవదేవుడే మతాంతర వివాహం చేసుకున్నాడంటే.. దేవుడు ఒక్కడే అని.. పేర్లు మాత్రమే వేరని.. కనుక ఆ దేవుని పేరుతో మతాలను సృష్టించి.. ఆ మతాల మత్తులో మారణహోమం సృష్టిస్తూ మృగాలుగా కాకుండా.. ఆ పరమాత్మ స్వరూపం ఒకటేనని.. ఒకరి పైన ఒకరు కరుణ కలిగి మానవత్వంతో జీవించమని చెప్పకనే చెప్పారు ఆ శ్రీనివాసుడు. అందుకే కలియుగ దైవంగా పూజలనందుకుంటున్నారు ఆ అపరంధాముడు.

Advertisement

Next Story