- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో మొత్తం 118 స్థానాలకు ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా.. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ24 అసెంబ్లీ స్థానాలు, త్రీ పార్లమెంట్ స్థానాలు దక్కాయన్నారు. పార్లమెంట్ స్థానల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలతో కలిపి జనసేన మొత్తం 40 స్థానాల్లో పోటీ పడనుందని పవన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 24 స్థానాల్లో క్లారిటీ వచ్చింది. ఇందులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 19 మంది అభ్యర్థులను మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఆరాచక పాలనను గద్దే దించేందుకు తాము సిద్ధం అయ్యామని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తు పెట్టుకున్నట్లు మరోసారి చెప్పుకొచ్చారు. అలాగే తాము అసెంబ్లీ తో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 57 చోట్ల గెలుపు గుర్రాలను వెతుకుతున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీతో పొత్తు ఉండటంతో వారు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, పోటీని దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఫైనల్ చేయాలో డిసైడ్ అవుతామని ప్రకటించారు.
Read More..