- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janasena: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం.. జనసేన పార్టీ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని జనసేన పార్టీ(Janasena Party) ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా.. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Diputy CM Pawan Kalyan) ఇచ్చిన ప్రసంగంతో, అసెంబ్లీ(AP Assembly)లో బడ్జెట్(Budget) ప్రవేశ పెడుతున్న సమయంలో మంత్రి పయ్యావుల(Minister Payyavula Keshav) మాటలను జత చేసి పోస్ట్ చేసింది. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని తెలిపింది.
అలాగే 2022 ఫిబ్రవరి 20న నరసాపురం వేదికగా జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభ సాక్షిగా, నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం(YCP Govt) మత్స్యకారుల జీవన ఉపాధి దెబ్బతీసే జీవో 217 రద్దు చేయాలంటూ, వారికి సబ్సిడీకి డీజిల్ అందించేలా, వారికి జీవన భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నది. అంతేగాక ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఈ అంశంపై హామీ ఇచ్చినట్లు గుర్తు చేసింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం నేడు శాసనసభ వేదికగా జీవోను ఉపసంహరించుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మత్స్యకార బోట్లకు సబ్సిడీలో డీజిల్ అందించేలా ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని స్పష్టం చేసింది.