టీడీపీ, జనసేన పొత్తుపై కుట్ర.. ముద్రగడ, జోగయ్యపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-03-02 07:38:40.0  )
టీడీపీ, జనసేన పొత్తుపై  కుట్ర.. ముద్రగడ, జోగయ్యపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాపు సంఘం నేతలు ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్యపై తిరుపతి జనసేన అధ్యక్షుడు కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, పవన్ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య రాసిన లేఖలపై ఆయన స్పందించారు. టీడీపీ, జనసేన పొత్తు చెడగొట్టేందుకే ఆయన లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ, జోగయ్యలను బలిజలు, కాపులు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌ను మంత్రులు ఘాటుగా విమర్శిస్తున్నారని, వారికి హరి రామ జోగయ్య ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. కాపులకు 40 సీట్లు, అధికార భాగస్వామ్యం ఇవ్వాలని సీఎం జగన్‌కు హరి రామ జోగయ్య లేఖ రాయాలని సూచించారు. హరి రామ జోగయ్య మాటను ఆయన కుమారుడే వినడం లేదని, మిగతా వారు ఎందుకు వినాలని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.

Read More..

బాబాయ్ YS వివేకా హత్య కుట్రలో CM జగన్ పాత్ర: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story