YS Jagan మరో సంచలన నిర్ణయం.. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో పిటిషన్

by Satheesh |   ( Updated:2024-07-23 11:32:45.0  )
YS Jagan మరో సంచలన నిర్ణయం.. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ప్రతిపక్ష నేత హోదా ఎపిసోడ్ రాష్ట్ర హైకోర్టుకి చేరింది. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హై కోర్టును ఆశ్రయించారు. శాసన సభలో తనకు అపొజిషన్ లీడర్ హోదా ఇచ్చేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా జగన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపడుతుందా.. లేదా..? ఒక వేళ విచారించిన ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైసీపీ అధికారంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ జగన్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, జగన్ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో జగన్ హై కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed