పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి ‘జబర్దస్త్’ నటులు

by srinivas |   ( Updated:2024-04-17 11:25:10.0  )
పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి ‘జబర్దస్త్’ నటులు
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్‌కు సామాన్యులే కాదు.. నటులు సైతం అభిమానిస్తారు. ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తారు.. ఏ కార్యక్రమం చేపట్టమన్నా చేస్తారు. ఇక జబర్దస్త్ నటులు అయితే పవన్ అంటే పిచ్చి. పవన్‌ను దేవుడితో పోల్చుతారు. చాలా షోల్లో పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ గెలుపు కోసం జబర్దస్త్ నటులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి రూరల్ మండలం బీఆర్టీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

జబర్దస్త్ షోతో అలరించే నటులు తమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. వారిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు.

Advertisement

Next Story