- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే.. : చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: ‘అరకు ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం. నాకు బాగా నచ్చిన ప్రాంతం. అరకు కాపీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గంజాయిని పరిచయం చేసింది’ అంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అరకులో నిర్వహించిన టీడీపీ రా.. కదిలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడప కూడ దాటలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి పేదల రక్తం తాగుతుందని, ఈ ఐదేళ్లలో జగన్ బటన్ నొక్కడం తప్ప ఒక్క మంచి పనైనా చేశాడా అని ప్రజలను ప్రశ్నించారు. 16 గిరిజన పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగన్ అని ధ్వజమెత్తారు. జగన్‌కు గిరిజన పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదని.. గిరిజన బిడ్డలకు ఐఏఎస్ , ఐపీఎస్ కోచింగ్ ఇప్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు.
Read More..
Breaking: ఆంధ్రాలో ఆగని అంగన్వాడీల వార్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు