తిరుమల పవిత్రతను మంటగలపడమే జగన్ రెడ్డి ఉద్దేశమా?: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

by Seetharam |   ( Updated:2023-09-19 09:23:04.0  )
తిరుమల పవిత్రతను మంటగలపడమే జగన్ రెడ్డి ఉద్దేశమా?: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, తిరుమల పవిత్రతను మంటగలపడమే జగన్ రెడ్డి ఉద్దేశమా? అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు.శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి చేష్టలు ముమ్మాటికీ క్షమించరాని తప్పిదాలే అని అభిప్రాయపడ్డారు. తిరుమలేశుడి సన్నిధిలో జగన్ రెడ్డి విపరీత చేష్టలు, టీటీడీ వ్యవహారశైలిపై సదరు విభాగం ఛైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించడం లేదో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని నిలదీశారు. మహాద్వార దర్శనం నిబంధనను అధికారపార్టీ ఎమ్మెల్యే కొడాలినాని ఎందుకు పాటించలేదో టీటీడీ సమాధానం చెప్పాలి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. పరమ పవిత్రమైన అక్షింతల్ని స్వామివారి సన్నిధిలోనే చేతులతో దులిపేసి, నేలపాలు చేసిన ముఖ్యమంత్రిని ఏమనాలి? అని ప్రశ్నించారు. హిందూమతంపై నమ్మకంలేనప్పుడు, వేంకటేశ్వరస్వామిపై భక్తి, విశ్వాసం లేనప్పుడు జగన్ రెడ్డి ఎందుకు తిరుమలకు వెళ్తున్నాడు? అని నిలదీశారు. దేవాదాయశాఖ మంత్రిని కాదని, రెడ్లను మాత్రమే వెంటపెట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి ఎలా సమర్థించుకుంటాడు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం పరుచూరి అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.సీఎం స్థానంలో ఉండి చేయకూడని పనులు చేయడం, అనాదిగా వస్తున్న ఆచారాలు ..సాంప్రదాయాలను అపహాస్యం చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్స వాలు ఎప్పుడు జరిగినా ఆయన సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోలేదని...సతీసమే తంగా స్వామివారికి ఏనాడూ పట్టువస్త్రాలు సమర్పించ లేదని అన్నారు. క్రైస్తవమతాన్ని అనుసరించే కుటుంబంలో ఒకడైన జగన్ రెడ్డి, కేవలం ఓట్లకోసమే గతంలో తాను హిందువునని నమ్మించే ప్రయత్నం చేశాడని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.

కొడాలి నాని నిబంధనలు తుంగలో తొక్కారు

ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా, వారు హిందూమతానికి, హైందవ ధర్మానికి బద్దులై వ్యవహరించాల్సిందేనని ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనే నిబంధనను జగన్ రెడ్డి ఎప్పుడూ పాటించలేదు అని అన్నారు. అలానే తనతోపాటు మహాద్వార దర్శనానికి ఎవరిని తీసుకెళ్లాలనే నిబంధనను కూడా ముఖ్యమంత్రి విస్మరించారు. అధికారపార్టీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి అయిన కొడాలినాని ముఖ్యమంత్రితో పాటు మహాద్వారం గుండా స్వామి వారి దర్శనానికి వెళ్లడం, దాన్ని టీటీడీ అధికారులు నిరోధించకపోవడం ముమ్మాటికీ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమేనని అభిప్రాయపడ్డారు. మహాద్వారం నుంచి స్వామి వారి దర్శనానికి వెళ్లిన కొడాలినానిని చూశాక, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నేతలు భవిష్యత్‌లో అదే పద్ధతి అనుసరించరని టీటీడీ చెప్పగలదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి బాటలోనే కొడాలినాని టీటీడీ సంప్రదాయాలను తుంగలో తొక్కడాన్ని ఎవరూ హర్షించరన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అయినంతమాత్రాన సెక్యూరిటీ అధికారి కొడాలి నానిని మహాద్వార దర్శనానికి ఎలా అనుమతిస్తారో టీటీడీ సమాధానం చెప్పాలి అని నిలదీశారు. టీటీడీకి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఈవోను నియమించలేదు. జేఈవోనే ఈవోగా వ్యవహరిస్తున్నారు.‘ కొడాలినాని ఉదంతంపై జేఈవో సమాధానం చెప్పాల్సిందే.టీటీడీ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టి పోయిందో చెప్పాల్సిన పనిలేదు అని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి క్రైస్తవ మతస్తుడని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి ఏ మతాన్ని అనుసరిస్తు న్నారో తెలియదు.. అధికారులు ఏంచేస్తున్నారో అసలే తెలియదు. కొడాలి నాని ముఖ్యమంత్రితో పాటు మహాద్వారం నుంచి స్వామి వారి దర్శనానికి వెళ్లిన వ్యవహారంపై టీటీడీ, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ప్రపంచప్రఖ్యాతి పొందిన అత్యున్నత దేవస్థానం లో జరిగిన తప్పిదం ఏదైనా.. అది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అధికారంలో ఉన్నా మన్న అహంకారంతో హిందూ మతాన్ని, హైందవధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తామం టే కుదరదు. స్వామివారికి ముఖ్యమంత్రి ఎందుకు సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించ డం లేదో, ఎందుకు సంప్రదాయాలు, ఆచారాలను మంటగలిపేలా వ్యవహరిస్తున్నారో, ఆయన అలా చేస్తున్నా ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు తెలియాలి. జరిగిన ఘటనలపై టీటీడీ, ప్రభుత్వం, దేవాదాయశాఖ మంత్రి స్పందించాల్సిందే’ అని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story