- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP Janasena : టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే 130 సీట్లు ఖాయం
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదు అయిన స్కిల్ స్కామ్ కేసులో అసలు పస లేదని సీనియర్ పొలిటీషియన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. కుట్ర పూరితంగానే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలు పాల్జేశారన్నారు. చంద్రబాబు నాయుడును జైల్లో కాకుండా హౌస్ రిమాండ్‌కు న్యాయస్థానం అనుమతి ఇవ్వాలని గోనె ప్రకాశ్‌రావు సూచించారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఇందుకు పలు కేసులు ఉదాహరణలుగా ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి పెరిగిందే తప్ప ఒరిగిందేమీ లేదని గోనె ప్రకాశ్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 88 సీట్లలో గెలుపొందడం ఖాయమన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే 130 స్థానాల్లో గెలుపొందడం ఖాయమన్నారు. మరోవైపు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదని గోనె ప్రకాశ్‌రావు అభిప్రాయపడ్డారు.
More News : టీడీపీలో నారా భువనేశ్వరి యాక్టివ్.. తొలిసారి పార్టీ నేతలతో కీలక సమావేశం