నేను తప్పు చేయలేదు.. చేయను..చేయబోను : బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబు

by Seetharam |   ( Updated:2023-11-01 06:06:05.0  )
నేను తప్పు చేయలేదు.. చేయను..చేయబోను : బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 52 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు అండగా నిలిచారని అది మరచిపోలేనని చెప్పుకొచ్చారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటు తన విడుదలకు ప్రత్యేక పూజలు, అనేక కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ జీవితాంతం తోడుగా ఉంటానని అన్నారు. నాడు తాను చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చాలా మంది రోడ్డుమీదకు వచ్చి సంఘీభావం తెలిపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రపంచం మెుత్తం తాను చేసిన అభివృద్ధిని, విధానాలను తెలియజేస్తూ ప్రజలకు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమాలతో తన జీవితం ధన్యమైందని అన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏతప్పు చేయలేదు.. చేయను..చేయబోను.. చేసినా సహించను అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకపోవడమే తన నిబద్దత అని చెప్పుకొచ్చారు. సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. పార్టీలు, నాయకులు తనకు సహకరించారని వారందరికీ చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సీపీఐ,సీపీఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సంఘీభావం ప్రకటించారని వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

నా జన్మధన్యమైంది

‘మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు.కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు.రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీరు చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోను అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ సంఘీభావం ప్రకటించారని చంద్రబాబు నాయుడు కొనియాడారు.‘హైదరాబాద్‍లో ఐటీ ఉద్యోగులు కూడా మొన్న సంఘీభావం తెలిపారు.నేను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందినవారంతా మద్దతిచ్చారు’ అని చంద్రబాబు తెలిపారు.

Read More: జైలు నుంచి చంద్రబాబు విడుదల.. దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు

Advertisement

Next Story