టీడీపీని నిలబెట్టింది నేనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

by Mahesh |
టీడీపీని నిలబెట్టింది నేనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మహిళా నాయకురాలు.. లక్ష్మీ పార్వతి(Lakshmi Parvati)మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్(NTR) టీడీపీ పార్టీని పెట్టిన సమయంలో తాను.. ఆయనకు వెన్నుదన్నుగా ఉండి.. టీడీపీకీ 250 పైగా స్థానాలు రావడంలో తాను ఎన్టీఆర్ భార్యగా కీలక పాత్ర పోషించాచనని.. టీడీపీని రాష్ట్రంలో నిలబెట్టింది తానే అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావుకు కూడా భయపడలేదని, ఆ నాడు ఎన్టీఆర్ శవం వద్ద నేను చేసిన శపథం అదేనని, సైకిల్ సింబల్ వల్లే నేను రాజకీయంగా దెబ్బతిన్నానని, చంద్రబాబు, భువనేశ్వరి, పురంధేశ్వరి కుట్రల వల్లే నేను నందమూరి కుటుంబానికి దూరమయ్యానని.. ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే తనకి రావాల్సీన టీడీపీ పార్టీని, సైకిల్ గుర్తును లాక్కోని తనను రాజకీయంగా దెబ్బతీశారంటూ లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed