నేను ఎక్కడికీ పారిపోలేదు..హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలోనే ఉన్నా: రామ్ గోపాల్ వర్మ

by Mahesh |
నేను ఎక్కడికీ పారిపోలేదు..హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలోనే ఉన్నా: రామ్ గోపాల్ వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా.. విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ(RGV) ఇంటికి నోటీసులు అందించారు. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టేందుకు పోలీసులు ఆర్జీవీ కోసం వెతుకుతున్నారు. కాగా ఆయన కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో పోలీసులకు భయపడి ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తున్నాయి.

అలాగే పోలీసులు కూడా ఆయన కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. తాను ఎక్కడికి పారిపోలేదని.. హైదరాబాద్ లోని తన ఆర్జీవీ డెన్ లోనే ఉన్నానని.. రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన.. తనపై 5 కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని.. నోటీసులపై తాను ఇచ్చిన రిప్లయ్‌పై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానని, అరెస్ట్‌ చేస్తారనే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశానని, అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానని.. నా ట్వీట్ల వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఈ సందర్భంగా ఆర్జీవీ మీడియాతో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed