- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు!!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి రీఓపెన్ కానున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈనెల 12కు బదులు 13 వ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని, ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపన్ తేదీ వాయిదాపడే అవకాశం ఉందని తెలుస్తోంది.