- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోదావరిలో గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంటగంటకు పెరుగుతున్న వరద కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి.. ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా పోలవరం వద్ద 13.9 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో.. ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి.. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులు గా ఉంది. పై నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సహాయక చర్యల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొనాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story