సీఎం జగన్‌పై పద్యం రచించిన నందమూరి బాలకృష్ణ.. వింటే మైండ్ బ్లోయింగే..!! (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-10 16:54:48.0  )
సీఎం జగన్‌పై పద్యం రచించిన నందమూరి బాలకృష్ణ.. వింటే మైండ్ బ్లోయింగే..!! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ అధినేత, మాసీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. ఎన్నికల సమయంలో పార్టీ అధినేత జైలుకు వెళ్లడంతో లీడర్లు, కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి వారసుడు బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దని.. పార్టీ కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధమని ప్రకటించారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు, చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి ఇళ్లకు వెళ్లడానికి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్‌ను ఉతికి ఆరేశారు. జగన్ అతినీతిని, అక్రమాలను వర్ణిస్తూ ఓ పద్యాన్ని కూడా పాడారు. ప్రస్తుతం ఆ పద్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story