- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తీవ్ర ఉత్కంఠ.. పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఏడాది ఏపీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లోని ఈవీఎం ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనపై సీరియస్ అయి.. వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గత నెల చివర్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశించింది. కాగా నేడు రామకృష్ణారెడ్డి పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన గొడవల్లో పిన్నెల్లిపై నాలుగు కేసులు నమోదైన విషయంత తెలిసిందే. ఈయన ఈవీఎం ధ్వంసం కేసులో A1 గా ఉన్నారు. కాగా గతంలో టీడీపీ విడుదల చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ పిన్నెల్లి కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయన్నది జనాల్లో ఉత్కంఠ నెలకొంది.