Breaking:సీఏం జగన్ కు హైకోర్టు నోటీసులు..కారణం ఇదే..!

by Indraja |
Breaking:సీఏం జగన్ కు హైకోర్టు నోటీసులు..కారణం ఇదే..!
X

దిశ డైనమిక్ బ్యూరో: వైసీపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపి హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం తన సొంత పార్టిని ప్రజల్లో బలోపితం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేసి వివిధ మార్గాల్లో ప్రకటనలు ఇస్తుందని హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆ పిల్ పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, వైకాపా ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్‌ ఎండీ,విశాఖలోని సీబీఐ ఎస్పీ, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ ఎండీ, దిల్లీలోని సీసీఆర్‌జీఏ కార్యదర్శికి కూడ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 6కి వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పార్టీ ప్రయోజనాల కోసం కోట్లు రూపాయలను ప్రకటనలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని.. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ పిల్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed