High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

by karthikeya |   ( Updated:2024-10-28 05:36:32.0  )
High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు (High Court) అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం నేడు (సోమవారం) జరిగింది. అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, చంద్రధనశేఖర్‌, గుణరంజన్‌లు ప్రమాణం చేశారు. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్ (CJ Dheeraj Singh Thakur) వీరితో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉంటే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం మే15వ తేదీన మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌లతో పాటు ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజా­బాబు, గేదెల తుహిన్‌ కుమార్‌ పేర్లను కూడా అదనపు న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేస్తూ కేంద్రానికి పంపింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించి వీరిలో ముగ్గురికి ఆమోద ముద్ర వేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వీరి నియామకం అధికారికంగా జరిగింది. ఇక ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. అయితే మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed