Ap News: చెరువులను తలపిస్తున్న రోడ్లు.. ఎందుకో తెలుసా..?

by srinivas |
Ap News:  చెరువులను తలపిస్తున్న రోడ్లు..  ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి వర్షం విస్తారంగా కురుస్తోంది. దీంతో శ్రీకాకుళం పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వర్షపు నీటితో మురుగు నీరు కూడా రోడ్లపైకి భారీగా వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లు లోతు నీళ్లలోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోవైపు ఇళ్లలోకి కూడా మురుగు నీరు చేరింది. దుర్గంధంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్లే మురుగు నీరు ఇళ్లలోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షం పడితే చాలు కాలనీల్లో నీళ్లు నిలిచిపోతున్నాయని, మోకాళ్లలోతు నీళ్లలోనే వాహనరాకపోకలు సాగుతున్నాయని అంటున్నారు. ఎప్పుడు ఏ మేన్ హోల్ తెరుచుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వంలోనైనా డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story