జనసేన అంత బహీనంగా ఉందా?.. పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య సంచలన లేఖ

by GSrikanth |
జనసేన అంత బహీనంగా ఉందా?.. పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పందించారు. టికెట్ల కేటాయింపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆదివారం సంచలన లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరుగలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అంత హీన పరిస్థితిలో ఉందా? అని అడిగారు. జనసేన శక్తిని స్వయంగా పవన్ కల్యాణే తక్కువ అంచనా వేసుకుంటున్నారని గుర్తుచేశారు. 24 సీట్ల కేటాయింపు జనసేనను సంతృప్తి పరచలేదని అన్నారు. వాళ్లు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారు.. పవన్ కల్యాణ్‌ను రెండున్నేళ్లు సీఎంగా చూడాలనేది జనసైనికుల కోరిక అని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరు అని అన్నారు.

Advertisement

Next Story