- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harirama Jogaiah: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.. చంద్రబాబుకు కీలక సూచన
దిశ, డైనమిక్ బ్యూరో: ‘జగన్ పోవాలి - పవన్ రావాలి’ అనేదే కాపుల లక్ష్యమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పొత్తు అనేది పార్టీ నిర్ణయాల్లో భాగమని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఏ పార్టీతో పొత్తుకు వెళ్ళినా తమకు పర్వాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి సీటులో పవన్ కల్యాణ్ కూర్చోవాలని ఆకాంక్షించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ కాపులకు న్యాయం పవన్ ద్వారా జరగాలనేదే తమ ఆకాంక్ష అని హరిరామ రామజోగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు హరిరామ జోగయ్య పలు సూచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన కోరారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అలాగే జనసేనతో పొత్తుకు చంద్రబాబు ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి సీటుపై పవన్ కల్యాణ్‌ను కూర్చోబెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలోనూ..పాలనలోనూ నారా లోకేశ్‌ను భాగస్వామ్యం చేయాలని చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు.