- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి.. నెలకు రూ.5 లక్షలు భారం
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: నగరం నడిబొడ్డున ఉన్న శివాజీ పార్క్ నిర్వహణ విషయంలో మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ) నెలకు సుమారు రూ.5 లక్షల ఆదాయాన్ని కోల్పోతోంది. అవినీతికి అలవాలమైన వైసీపీ పాలక వర్గం ఒత్తిడికి లొంగి మేయర్ భర్త సిఫార్సులతో నిబంధనలకు విరుద్ధంగా 14 సంవత్సరాల క్రితం ఎంపిక చేసిన పాత కాంట్రాక్టర్‌నే కొనసాగిస్తున్నారు. జీవీఎంసీకి నెల నెలా ఆదాయం వచ్చేలా మార్చిలో పిలిచిన కొత్త టెండర్ ను పక్కనపడేసిన అధికారులు నెలకు ఐదు లక్షల భారంతో పాత కాంట్రాక్టర్ కే వత్తాసు పలుకుతున్నారు. మార్చి లోనే పాత కాంట్రాక్టర్ గడవు ముగిసినా కొత్త టెండర్ జోలికి పోకుండా అలా నెట్టుకొచ్చేస్తున్నారు.
సంస్థకు భారం కాకుండా కొత్త టెండర్
పాత విధానంలో కేవలం ప్రవేశ రుసుము వసూలు, క్యాంటిన్ లు, ఈవెంట్ లకు డబ్బు వసూలు చేసుకొనేవిధంగా టెండర్ పిలచారు. ఇలా ఏడాదికి జీవీఎంసీకి 15 లక్షల వరకూ ఆదాయం వస్తే , పార్క్ నిర్వహణకు 40 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. 15 నుంచి మంది కార్మికులను పార్క్ నిర్వహణ కోసం నియమించి వారికి ఆప్కాస్ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పార్క్ నిర్వహణ భారం కాంట్రాక్టర్ భరించే విధంగా టెండర్ పిలచారు. గత ఏడాది నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతోపార్క్ ను ఆధునీకరించిన నేపధ్యంలో పార్క్ కు వచ్చే సందర్శకులు కూడా పెరుగుతారన్న ఉద్దేశంతో టెండర్ పిలచారు. ఈ టెండర్ లో ఎక్కువ మంది కార్మికులుండాలనే షరతు విధించడంతో ఎవ్వరూ టెండర్ వేయలేదు. ఆ తరువాత కార్మికుల సంఖ్య పేర్కొనకుండా నిర్వహణ భారం భరిస్తూ జీవీఎంసీకి ఎడాదికి ఎంత చెల్లిస్తారంటూ మూడేళ్ల పాలనాకాలంతో టెండర్ పిలచారు. దానికి స్పందన వచ్చింది. కొత్త టెండర్ వల్ల జీవీఎంసీకి నెలకు నాలుగు లక్షల భారం తగ్గడమే గాక కొంత ఆదాయం కూడా వస్తుంది.
మేయర్ భర్త ప్రమేయంతో బుట్టదాఖలు
14 సంవత్సరాలుగా కొనసాగుతున్న పాత కాంట్రాక్టర్ టెండర్ వేయలేదు. వేయకుండా మేయర్ గొలగాని హరి వెంటక కుమారి భర్త గొలగాని శ్రీనివాస్ ద్వారా వత్తిడి తీసుకువచ్చి కొత్త టెండర్ ను అడ్డుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి జీవీఎంసీకి భారం తగ్గి ఆదాయంవచ్చే విధంగా కొత్త టెండర్ ను ఖరారు చేయాల్సిన అధికారులు ప్రభుత్వం మారిన తరువాత కూడా వైసీపీ నేతల ఒత్తిడికే తలొగ్గి వ్యవహరిస్తున్నారు. 14 సంవత్సరాలుగా తక్కువ మొత్తం చెల్లిస్తూ అక్కడే పాగా వేసి హవా చెలాయిస్తున్న పాత కాంట్రాక్టర్ గడువు ముగిసినా గుడ్డిగా కళ్లు మూసుకొని కొనసాగిస్తున్నారు. ప్రజలపై భారీగా పన్నుల భారం వేసే జీవీఎంసీ లో నెలకు ఐదు లక్షల రూపాయలు నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరకుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.