- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap Assembly Sessions: 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బడ్జెట్ సమావేశాల(AP Budget Meetings)కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు 10 గంటలకు శాసనసభ(Legislature), శాసనమండలి(Legislative Council) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir) పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. మార్చి 3న బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 22, 23న అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించారు. అటు ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు.