- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: మంత్రి అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి ఇంటి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టులను వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో నిరుద్యోగులకు ఆందోళనకు దిగారు. దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలపై మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని బైబై జగన్ జగన్, బైబై వైసీపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులతో యూత్ కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని కోరారు. అయితే యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
Read More..
BREAKING: కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం.. నేడు భారత్ బంద్‌కు పిలుపు