నన్ను ఒకే కులానికి పరిమితం చేయెుద్దు: Pawan Kalyan

by srinivas |   ( Updated:2023-03-11 15:07:30.0  )
నన్ను ఒకే కులానికి పరిమితం చేయెుద్దు: Pawan Kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకే కులానికి తనని పరిమితం చేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో బీసీ నేతలతో సమావేశమైన ఆయన బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదని, ఈ దేశానికి వెన్నుముక అని కొనియాడారు. ఒక కులం పరిధిలోనే తాను ఆలోచించడం లేదన్నారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే సామాజిక న్యాయం అమలవుతుందని చెప్పారు. బీసీలు అత్యధికంగా ఉండి, తమ న్యాయమైన డిమాండ్లను దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇందుకు బీసీల్లోని అనైక్యతే కారణమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను కేవలం కాపులకు మాత్రమే నాయకుడిని కాదని, ప్రజలు అందరికీ నాయకుడినని స్పష్టం చేశారు. వెనుకబడిన కులాలను భుజాలనెత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఓటు అమ్ముకోకూడదని, ఓటు కొనుక్కోకూడదని ఆయన సూచించారు. అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తనపై కాపులతోనో, బీసీ నేతలతోనో, ఎస్సీ ఎస్టీ నేతలతోనో తిట్టిస్తున్నారని చెప్పారు. ఇలా తిట్టుకోవడం వల్ల గ్రామస్థాయిలో ఇరుపార్టీల నేతలు కొట్టుకుంటారని, దాన్ని అధికార పార్టీ చోద్యంగా చూస్తుందన్నారు. అలాంటి వారిని తిప్పి కొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Also Read..

Pawan Kalyan: అలా ఎందుకు చేశారు.. బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story