- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెను ఢీకొట్టి గెలవండి.. టీడీపీ నేతలకు మంత్రి అంబటి సవాల్
దిశ, ఏపీ బ్యూరో: బీసీ మహిళా మంత్రిని ధైర్యంగా ఎదుర్కోలేక కార్యాలయంపై దాడి చేయడం విచారకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి టీడీపీ-జనసేనలు అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా నియమించారన్నారు. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి ఆమె ఇక్కడ ఆఫీసు నుంచి పని చేయడానికి సర్వం సిద్ధమైన క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడుల వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని మంత్రి అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
ఒక బీసీ మహిళైన విడదల రజినీ గుంటూరులో పోటీ చేస్తుంటే.. కడుపు మంట ఎందుకు? అని మంత్రి అంబటి నిలదీశారు. దమ్ముంటే ఆమెను ఢీకొట్టి గెలవాలని సవాల్ విసిరారు. ఎప్పుడైతే టీడీపీ జనసేనతో జతకట్టిందో..ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించేందుకు వారు కంకణం కట్టుకున్నారన్నారు. ఇదే సందర్భంలో ఖమ్మంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు తానెళితే..తనపై కూడా దాడి చేయడానికి టీడీపీ వాళ్లే ప్రయత్నించారని గుర్తు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అందరూ చూస్తుండగా.. కాలి చెప్పు తీసి కొడతానంటారన్నారు. ఇదెక్కడి విడ్డూరమని, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైన వ్యక్తి అలా చేస్తాడా..? అని ప్రశ్నించారు. ఆయనో పెద్ద అరాచక శక్తి కాదా..?, అలాంటి అరాచక శక్తితో కలిసి చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని మంత్రి అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.