- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janasena: ఇసుక అక్రమాలను అడ్డుకుంటే దాడులకు తెగబడతారా..!
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపూ లేకుండా పోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నెల్లూరు జిల్లా దువ్వూరులో జనసేన నాయకులపై వైసీపీ దాడిని ఆయన ఖండించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా తీరంలో అడ్డగోలుగా తవ్వి దువ్వూరు మీదుగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. భారీ వాహనాల్లో యదేచ్ఛగా సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణా వల్ల తమ గ్రామంలో రోడ్లు, చిన్నపాటి ఇళ్లు దెబ్ల తింటున్నాయని దువ్వూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారని మనోహర్ తెలిపారు. గ్రామస్తుల తరపున ఇసుక లారీలను అడ్డుకున్న జనసేన నాయకులపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డాయని మండిపడ్డారు. ఈ దాడిలో ఆత్మకూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జి నలిశెట్టి శ్రీదర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. అప్రజాస్వామికమైన ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. పోలీసు అధికారులు తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించాలని నాదెండ్ మనోహర్ సూచించారు.
మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గం దువ్వూరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్‌పైవైసిపి నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున ఈ రోజు స్థానిక గాంధీ బొమ్మ వద్ద నుంచి అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.