- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gandikota: గండికోట అభివృద్ధికి నిధులు.. ఇక గుంటూరు పర్యాటకం షురూ
దిశ ప్రతినిధి, గుంటూరు: "అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో భారతదేశంలోని కడప జిల్లాలో ఉన్న గండికోటను అభివృద్ధి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుండటం ఆనందంగా ఉంది..."అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఢిల్లీలోని సమాచార భవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ గండికోట అభివృద్ధికి రూ.77.91 కోట్ల నిధులను కేటాయించినందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు అయన ధన్యవాదాలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ, ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది. పెమ్మసాని ప్రయత్నానికి స్పందిస్తూ గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్లను మంజూరు చేసింది.
ఇలా వినతి.. అలా మంజూరు..
గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసేలా అభివృద్ధి చేయించేందుకు పెమ్మసాని నడుం బిగించారు. అందుకు గాను నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు పెమ్మసాని గడిచిన నవంబర్ 4న లేఖ రాశారు. అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాలలో గండికోటకు కూడా ప్రముఖ స్థానం కల్పించింది. అందులో భాగంగా గండికోట అభివృద్ధితో పాటు పరిసర నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను నిధులను కేటాయించింది.