- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP BRS: సీఎం కేసీఆర్‌పై తోట చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ, టీడీపీతో ఏపీ ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఆటో నగర్‌లో బీఆర్ఎస్ ఏపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ అంటే జగన్‌కూ, చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ మాత్రమే రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక కంపెనీ అని చెప్పారు. స్టీట్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని తోట చంద్రశేఖర్ జోస్యం చెప్పారు. మతతత్వ బీజేపీని దేశం నుంచి తరమికొట్టాలంటే అది బీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఏపీలో ఉన్న వనరులు తెలంగాణలో లేకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. తెలంగాణ మోడల్ లాగానే అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో నడిపించాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారన్నారు. ఏపీలో ఆర్భాటాలు ఎక్కువని ఆచరణ శూన్యమన్నారు. అందుకే ఇప్పటి వరకు కనీసం రాజధాని నిర్మించుకోలేపోయమని తోట చంద్రశేఖర్ విమర్శించారు.