- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP JAC Amaravati: బకాయిలపై లెక్కలు చెప్పండి!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ఎందుకు లెక్కలు చెప్పడం లేదని నిలదీవారు. ప్రభుత్వం ఎందుకు బకాయిలపై లెక్కలు చెప్పడంలేదో, ఇందులో ఏమీ రహస్యలు దాగి ఉన్నాయో ఉద్యోగులకు అర్దం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ఎంతవాడుకున్నారు, ఇంతవరకు ఎంత చెల్లించారో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు.
ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో బుధవారం పర్యటించి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థపై ఉద్యోగులకు నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగా ట్రెజరీల వ్యవస్ధను బలోపేతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.