- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Jac Amaravati: మేం వ్యతిరేకం కాదు... సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి వ్యతిరేకం కాదని జేఏసీ చైర్మైన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదన్న ఆయన ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఇచ్చిన హామీలకు కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరగలేదని దీంతో క్రమబద్దీకరణ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారని ఇందుకు ఉద్యోగుల తరఫున తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉందంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కితాబిచ్చారు.